కోహ్లీ, కేఎల్ రాహుల్ మాటల యుద్ధం... ఇదిగో వీడియో!
- డీసీ, ఆర్‌సీబీ మ్యాచ్‌లో షాకింగ్ ఘటన
- డీసీ వికెట్ కీపర్ రాహుల్‌తో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ మధ్య వాగ్వాదం
- రాహుల్ కీపింగ్ చేస్తున్న సమయంలో అతనితో కోపంగా ఏదో మాట్లాడిన కోహ్లీ
- ఇద్దరి వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్
దానికి రాహుల్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ వాగ్వాదానికి గల కారణమేంటో తెలియలేదు. కానీ, మ్యాచ్ అనంతరం రాహుల్‌ను కోహ్లీ ఆలింగనం చేసుకోగా ఇద్దరు నవ్వుతూ కనిపించారు.
ఇక, ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీని బెంగళూరు మట్టికరిపించిన విషయం తెలిసిందే. కోహ్లీ మరోసారి అర్ధశతకం (51)తో రాణించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశారు. అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్టర్‌గా ఉన్నారు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి.