Advertisement

ఎర్రబెల్లి దయాకరరావుకు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సన్నిహితుడు!

Errabelli Dayakar Rao Faces Setback as Close Aide Joins Congress
  • కాంగ్రెస్‌లో చేరిన సోమేశ్వరరావు, పలువురు మాజీ సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య బీఆర్ఎస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర రావు సన్నిహితుడు సోమేశ్వర రావు, పలువురు మాజీ సర్పంచ్‌లు, జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Errabelli Dayakar Rao
Congress Party
BRS Party
Mahesh Kumar Goud
Palakurthi
Telangana Politics
Someshwara Rao
Party Hopping
Political Developments

More Telugu News