నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు... టీచర్లకు స్పష్టం చేసిన గంగూలీ

Ganguly Refuses Teachers Plea to Join protest
పశ్చిమ బెంగాల్ పాఠశాల సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్‌సీ) నియామకాల కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నియామకాలు రద్దు కావడంతో ఉద్యోగాలు కోల్పోయిన 'నిష్కళంక' ఉపాధ్యాయులకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక ఊరట కల్పించింది. కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు విధుల్లో కొనసాగవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఈ ఉపశమనం కొన్ని షరతులకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది.

ఇదిలా ఉండగా, ఉద్యోగాలు కోల్పోయిన కొందరు ఉపాధ్యాయులు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కోల్‌కతాలోని ఆయన నివాసంలో కలిశారు. ఏప్రిల్ 21న పశ్చిమ బెంగాల్ సచివాలయం వరకు తాము చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు హాజరు కావాలని వారు గంగూలీని ఆహ్వానించారు. అయితే, గంగూలీ అందుకు సున్నితంగా నిరాకరించారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని స్పష్టం చేశారు. ఇది తనకు ఏవిధంగానూ సంబంధం లేని అంశం అని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.
Go Back to Shorts
Sourav Ganguly
West Bengal School Service Commission
WBSSC
Teacher Recruitment Scam
Supreme Court
Kolkata
Protest
Politics
India
Cricket

More Telugu News