పాతబస్తీ మెట్రో పనులపై హైకోర్టు కీలక సూచనలు
- చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా చూడాలన్న హైకోర్టు
- పురావస్తు శాఖ గుర్తించిన కట్టడాల వద్ద పనులు చేపట్టకూడదన్న హైకోర్టు
- తదుపరి విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా
రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) వాదనలు వినిపించారు. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేశారు. చారిత్రక కట్టడాలను కూల్చివేయడం లేదని స్పష్టం చేశారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే స్థలాలను సేకరించి నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం కావాలని ఏఏజీ కోరారు.
మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. పురావస్తు శాఖ గుర్తించిన కట్టడాల వద్ద పనులు చేపట్టరాదని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.