ట్రంప్ విధానాలపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ ఆగ్రహం
- సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్న ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్
- ఫెడరల్ రిజర్వు సిస్టమ్ ను ముంచేశాయని మండిపాటు
- ఇప్పటికే న్యాయపోరాటానికి సిద్దమైన కాలిఫోర్నియా
ఇప్పటికే అమెరికాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై న్యాయపోరాటానికి సిద్ధం కాగా, తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జోరోమ్ పావెల్ దీనిపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ట్రంప్ టారిఫ్ విధానాలతో అమెరికాలో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన మండిపడ్డారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వు సిస్టమ్ (అమెరికా కేంద్ర బ్యాంకు)ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.