రామయ్య మరణం తెలంగాణకు తీరని లోటు: బండి సంజయ్
- గుండెపోటు కారణంగా వనజీవి రామయ్య మృతి
- రామయ్య మృతిపై విచారం వ్యక్తం చేసిన బండి సంజయ్
- జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటారని కితాబు
రామయ్య చేసిన సేవలను గుర్తించిన మోదీ ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు. ఆయన మరణం తెలంగాణకు, పర్యావరణ సమాజానికి తీరని లోటు అని చెప్పారు. వనజీవి బిరుదుతో ప్రసిద్ధిగాంచిన రామయ్య మరణం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.