5 విమానాల నిండా ఐఫోన్లను అమెరికాకు పంపిన యాపిల్.. కారణం ఏంటంటే?
- ట్రంప్ టారిఫ్ ల భయంతో ఇండియా, చైనాల నుంచి తరలింపు
- మార్చి నెలాఖరులో కేవలం మూడు రోజుల్లోనే ఎగుమతి
- ఇప్పటికిప్పుడు ధరలు పెంచబోమని స్పష్టం చేసిన యాపిల్
పన్ను పోటును తగ్గించుకోవడానికి భారత్, చైనాలలోని తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లు అన్నింటినీ వెంటనే అమెరికాకు చేరవేసింది. దీనివల్ల ఐఫోన్ల ధరలను మరికొంతకాలం స్థిరంగా ఉంచేందుకు యాపిల్ కంపెనీకి అవకాశం లభించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ట్రంప్ టారిఫ్ లు అమలులోకి వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు ఐఫోన్ల ధరలు పెంచే ఆలోచన ఏమీ లేదని యాపిల్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.