కూల్‌డ్రింక్స్ ఎడాపెడా తాగుతున్నారా?.. అయితే, ఇది మీకోసమే!
- శీతలపానీయాల్లో అధిక మోతాదులో సుక్రోజ్
- కాలేయంపై సుక్రోజ్ ప్రభావం కారణంగా పలు రుగ్మతలు
- డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశం
సుక్రోజ్ కారణంగా మనం తీసుకొనే ఆహార పదార్థాల్లోని అమైనో ఆమ్లాలు, కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో అసమతుల్యంగా మారిన గ్లూకోజ్ (హెక్టోజ్ షుగర్) శోషణ జరుగుతుందని, దీనివల్ల చిన్న పేగుల మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. ఆహారంలోని ప్రొటీన్లను కండరాలు పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ (అనబాలిక్), కొవ్వు, గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే విచ్ఛిన్నాత్మక జీవక్రియ (క్యాటబాలిక్)పై దుష్ప్రభావాలకు కూల్‌డ్రింక్స్‌లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్ కారణమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
జీవక్రియకు దోహదపడే కాలేయంపై సుక్రోజ్ ప్రభావం కారణంగా పలు రుగ్మతలు వస్తాయని వెల్లడైంది. క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసినప్పటికీ జీవక్రియపై పడే దుష్ప్రభావం కారణంగా గ్లూకోజ్‌ను శక్తిగా మార్చలేదని, ఫలితంగా డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం హెచ్చరించింది. అలాగే, అధిక సుక్రోజ్ జీర్ణ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని పేర్కొంది.