నేను, నా భార్య... పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఇదే: హరీశ్ శంకర్
- తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న హరీశ్ శంకర్
- ఎన్నో బాధ్యతలతో అలసిపోయానని వ్యాఖ్య
- మళ్లీ అలాంటి బాధ్యతలు వద్దనే పిల్లలు వద్దనుకున్నామన్న హరీశ్
తాను, తన భార్య స్నిగ్ధ... పిల్లలు వద్దనుకున్నామని హరీశ్ శంకర్ తెలిపారు. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని... తన చెల్లెలికి పెళ్లి చేయాలి, తమ్ముడిని సెటిల్ చేయాలి వంటి ఎన్నో బాధ్యతలు ఉండేవని చెప్పారు. ఈ బాధ్యతను నెరవేర్చడంలో తన భార్య తనకు ఎంతో సహకారం అందించిందని తెలిపారు. వీటితోనే తాను పూర్తిగా అలిసిపోయానని... మళ్లీ అలాంటి బాధ్యతలు వద్దనుకున్నామని తెలిపారు. పిల్లలు ఉంటే స్వార్థంగా తయారవుతామని... అన్నిటికీ అడ్జస్ట్ అయి బతకాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే తాము పిల్లలు వద్దనుకున్నామని తెలిపారు.