తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

YS Jagans Ugadi Greetings
  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందికీ ఉగాది శుభాకాంక్షలు
  • అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా ఆ భగవంతుడు చూడాలన్న జగన్
  • ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలి
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు" అని ఆయన పేర్కొన్నారు.

ఈ సంవత్సరం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

కాగా, ఈరోజు ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పంచాంగ శ్రవణం ఉంటుంది. ఈ ఉగాది వేడుకల్లో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. 
Go Back to Shorts
YS Jagan
Ugadi
Telugu New Year
Visakhapatnam
Andhra Pradesh
YCP
Indian Politics
Festival Greetings
Political News

More Telugu News