Vidala Rajini: మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదు

ACB Files Case Against Ex Minister Vidala Rajini
షార్ట్స్‌లో చూడండి
పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ. 2.2 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని సహా అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్  అధికారి పల్లె జాషువా, మరికొందరిపై ఏసీబీ కేసు నమోదైంది. 

ఈ కేసులో రజినిని ఏ1గా, పల్లె జాషువాను ఏ2గా, రజిని మరిది గోపిని ఏ3గా, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు. రజిని బెదిరింపులు, అక్రమ వసూళ్లపై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీశ్‌కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ చేయించిన దర్యాప్తులో ఆధారాలు లభించడంతో నిన్న కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Vidala Rajini
ACB Case
Extortion
YCP Leader
Palnadu District
AP Politics
Illegal Money
Palle Jashuva
Guntur RVEVO
Stone Crusher

More Telugu News