ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే కనుక బతికిపోతారు.. ట్రంప్‌తో పుతిన్
- ఉక్రెయిన్ దళాలను వదిలేయాలని పుతిన్‌ను కోరిన ట్రంప్
- పుతిన్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు
- యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్న ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియడానికి ‘చాలా మంచి అవకాశం’ ఉందని, పుతిన్‌తో గురువారం ఫలవంతమైన చర్చలు జరిగాయని ట్రంప్ నిన్న తెలిపారు. ‘‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నిన్న ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఈ భయంకరమైన, రక్తపాతంతో కూడిన యుద్ధం చివరకు ముగిసిపోయేందుకు చాలా మంచి అవకాశం ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పూర్తిగా చుట్టుముట్టబడిన ఉక్రెయిన్ దళాల ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను అభ్యర్థించినట్టు చెప్పారు.
కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని మాస్కో, కీవ్‌ను కోరుతున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.