శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు కూడా ఐటీ దాడులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు కూడా ఐటీ దాడులు

IT Raids continues on Sri Chaitanya Colleges
  • నిన్నటి నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ దాడులు
  • రూ.5 కోట్ల నగదు స్వాధీనం
  • 2020లోనూ శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు
హైదరాబాదులోని మాదాపూర్ లో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రధాన కార్యాలయంలో రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో, తెలంగాణతో పాటు ఏపీ, చెన్నై, ముంబయి, బెంగళూరు, ఢిల్లీలో కూడా శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 

ఐటీ అధికారులు ఈ దాడుల్లో రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అధికారులు శ్రీ చైతన్య విద్యాసంస్థల లావాదేవీల సాఫ్ట్ వేర్ ను పరిశీలించారు. విద్యా సంస్థల టాక్స్ చెల్లింపులపై ఐటీ శాఖ ఆరా తీస్తోంది. రసీదులు ఇవ్వకుండా అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజులు భారీగా వసూలు చేస్తున్నట్టు, అదే సమయంలో పన్నులు ఎగ్గొడుతున్నట్టు గుర్తించారు.  

2020లోనూ శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. అప్పట్లో ఐటీ అధికారులు రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Sri Chaitanya
IT Raids
Telangana
Andhra Pradesh

More Telugu News