ఈ ఊరు పేరే 'ప్రభాస్'.... ఇండియాలో కాదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ఊరు పేరే 'ప్రభాస్'.... ఇండియాలో కాదు!

prabhas village in nepal goes viral on social media
  • గ్లోబల్ స్టార్‌గా ప్రపంచ గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్
  • నేపాల్ లో ప్రభాస్ పేరుతో ఓ గ్రామం ఉన్న వైనం
  • తమ అభిమాన హీరో పేరుతో పొరుగు దేశంలో గ్రామం ఉండటంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ 
సాధారణంగా వివిధ ప్రాంతాల్లోని కాలనీలకు వ్యక్తుల పేర్లు ఉండటం మనం చూస్తుంటాం. కానీ, గ్రామాలకు వ్యక్తుల పేర్లు ఉండటం చాలా అరుదు. అయితే, రెబల్ స్టార్ ప్రభాస్ పేరుతో ఒక గ్రామానికి పేరు ఉండటం, అది కూడా మన దేశంలో కాకుండా పొరుగు దేశంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాప్యులారిటీ ప్రపంచవ్యాప్తం అయిన విషయం తెలిసిందే.

బాహుబలి, సాహో, సలార్ వంటి పాన్ ఇండియా మూవీలతో ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రభాస్ పేరుతో ఒక గ్రామం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక గ్రామానికి ప్రభాస్ పేరు ఉండటం, అది కూడా భారతదేశంలో కాకుండా పొరుగు దేశం అయిన నేపాల్‌లో ఉండటం విశేషంగా మారింది.

ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్‌లో పర్యటిస్తుండగా, ఒక ఊరి పేరు ప్రభాస్ అని ఉండటాన్ని గమనించాడు. దీంతో అతను వెంటనే ప్రభాస్ పేరుతో ఉన్న గ్రామ బోర్డు కనిపించేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను నేపాల్‌లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నానని, మన తెలుగు వారికి ప్రభాస్ అనే పేరు వినగానే ఒక వైబ్ వస్తుందని, మీరు ఎప్పుడైనా ప్రభాస్ అనే పేరుతో ఉన్న గ్రామాన్ని చూశారా? అంటూ ఆ వీడియోలో ప్రశ్నించాడు.

అయితే ఆ గ్రామానికి ప్రభాస్ అనే పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక కథ ఏమిటి? అన్నవి మాత్రం తెలియరాలేదు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడి పేరుతో ఒక గ్రామం ఉండటంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నేపాల్‌లోని ఒక చిన్న పట్టణం అయినప్పటికీ దీన్ని గర్వకారణంగా అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభాస్ అనే పేరు ఆ గ్రామానికి ఎలా వచ్చింది? అంటూ నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. 
Advertisement
Prabhas
Nepal
Prabhas Village
Social Media

More Telugu News