ఓటీటీ, సామాజిక మాధ్యమాలకు కేంద్రం హెచ్చరిక
- నైతిక విలువలు పాటించాలన్న కేంద్ర ప్రభుత్వం
- అశ్లీల కంటెంట్‌పై ఫిర్యాదులు వచ్చాయని వెల్లడి
- చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలన్న కేంద్రం
ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో రణ్వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో నిబంధనలు పాటించాలని కేంద్రం హెచ్చరించింది. చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే ఏ కంటెంట్‌ను కూడా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. వయస్సు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని తెలిపింది. ఓటీటీలు స్వీయ నియంత్రణను కలిగి ఉండాలని, నైతిక విలువలను పాటించాలని తెలిపింది.