భారత్, పాక్ ఆటగాళ్లను 'కేఎఫ్ సీ జనరేషన్' అని పేర్కొన్న అఫ్రిది
- దాయాదుల పోరుపై మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు
- భారత్ – పాక్ మ్యాచ్ అంటే గతంలో కనిపించే దూకుడు ఇప్పుడు లేదన్న అఫ్రిది
- నేటి తరం ఆటగాళ్లు అందరూ మెక్ డొనాల్డ్స్, కేఎఫ్‌సీ తరం వాళ్లు అంటూ వ్యాఖ్య
కాగా, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల తమ జట్టును ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. 1990ల నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్ మధ్య క్రికెట్ వైరం కొనసాగుతోంది. 2021లో దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చివరిసారిగా భారత్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన కీలక టోర్నీల్లో మాత్రం పాకిస్థాన్ ఓటమి పాలైంది.