హైడ్రా చెరువు పునరుద్ధరణ పనులు... బతుకమ్మకుంటలో ఉప్పొంగిన గంగ
- హైడ్రా చెరువుల పునరుద్ధరణ పనులు
- అంబర్‌పేటలోని బతుకమ్మకుంటలో జేసీబీతో పునరుద్ధరణ పనులు
- పైపు లైన్ పగిలి నీరు ఉబికి వచ్చిందని భావించిన స్థానికులు
- పరిశీలన జరిపి, భూగర్భం నుండి నీరు వచ్చిందని ధృవీకరించిన జలమండలి
దీంతో, ఎక్కడైనా పైపు లైన్ పగిలిందా? అనే కోణంలో జలమండలి అధికారులు పరిశీలన జరిపారు. కానీ పునరుద్ధరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎక్కడా, ఎలాంటి పైపు లైన్ లేదని, భూగర్భం నుండి మాత్రమే నీరు ఉబికి వచ్చిందని నిర్ధారించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. "మోకాలి లోతుకే ఉప్పొంగిన గంగ, హైడ్రా తవ్వకాల్లో బయటపడిన బతుకమ్మకుంట" అంటూ హైడ్రా ట్వీట్ చేసింది.