శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ప్రభాస్ కు ఆహ్వానం
- ఈ నెల 26న మహా శివరాత్రి
- ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు
- నేడు ప్రభాస్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణల తదితరులను కలిసి ఆహ్వానించారు. తాజాగా బొజ్జల సుధీర్ రెడ్డి పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. తాము నిర్వహించే ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
కాగా, శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందుకున్న వారిలో ఏపీ మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, యంగ్ హీరో నితిన్ తదితరులు ఉన్నారు.