వాణిజ్య యుద్ధ భయాలు... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానన్న ట్రంప్
- 1,018 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 309 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,018 పాయింట్లు నష్టపోయి 76,293కి పడిపోయింది. నిఫ్టీ 309 పాయింట్లు కోల్పోయి 23,071కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం భారతి ఎయిల్ టెల్ (0.19%) మాత్రమే లాభాల్లో ముగిసింది. జొమాటో (-5.24%), టాటా స్టీల్ (-2.91%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.68%), ఎల్ అండ్ టీ (-2.65%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.
అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 60 పైసలు మేర బలపడి రూ. 86.85కి చేరుకుంది.