మార్కాపురం రైల్వే స్టేషన్ లిఫ్ట్ లో ఇరుక్కున్న ప్రయాణికులు.. వీడియో ఇదిగో!
- మూడు గంటల పాటు అవస్థలు
- పరిమితికి మించి ఎక్కడంతో ఆగిన లిఫ్ట్
- డోర్లు తెరుచుకోకపోవడంతో భయంతో ప్రయాణికుల కేకలు
టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారు. లిఫ్ట్ పైనుంచి లోపలికి దిగి, ఎమర్జెన్సీ మార్గంలో ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 14 మందిని క్షేమంగా బయటకు తెచ్చారు. లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
