టీడీపీ కార్యాలయంపై దాడి.. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు రెండూ తప్పే: వైసీపీ నేత కేతిరెడ్డి
- ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే
- వారు ఎంత తిడుతున్నా చంద్రబాబు ఓపిగ్గా ఉన్నారన్న కేతిరెడ్డి
- అధిష్ఠానం దీనిని ఖండించి ఉంటే బాగుండేదన్న నేత
- జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా చేసి ఉంటారన్న కేతిరెడ్డి
భువనేశ్వరిపై పార్టీ నేతలు నిజంగానే అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే, అది తప్పని అధిష్ఠానం చెప్పి ఉంటే బాగుండేదని కేతిరెడ్డి పేర్కొన్నారు. అలా చెప్పలేదు కాబట్టే, చంద్రబాబును రాక్షసుల్లా హింసిస్తున్నారని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారని అన్నారు. అయితే, వారు ఎంత తిడుతున్నా, అవహేళనకు గురిచేసినా చంద్రబాబు మాత్రం చాలా ఓపిగ్గా ఉన్నారని, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్‌ను అనవసరంగా తిట్టడం వారిద్దరూ ఏకం కావడానికి ఉపయోగపడిందని కేతిరెడ్డి వివరించారు.