రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట

Dr Prabhavathi gets relief in Supreme Court in Raghu Rama Krishna Raju custodial torture case
  • ప్రభావతికి ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
  • తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. 

ప్రభావతి పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. అయితే విచారణకు సహకరించాలని ప్రభావతిని ఆదేశించింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Advertisement
Raghu Rama Krishna Raju
Prabhavathi
Supreme Court

More Telugu News