UPI Transactions: బీకేర్‌ఫుల్‌.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

These UPI Transactions will be Blocked from February 1 This is the Reason
షార్ట్స్‌లో చూడండి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీ తాలూకు ఐడీలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ (@, #, &) కలిగి ఉంటే.. అలాంటి యూపీఐ లావాదేవీలు స‌క్సెస్ కావు. ట్రాన్సాక్ష‌న్ ఐడీలో ప్ర‌త్యేక అక్ష‌రాలు లేకుండా ఆల్ఫాన్యూమ‌రిక్ (ఇంగ్లిష్ అక్ష‌రాలు, నంబ‌ర్లు)తోనే ఐడీలు జ‌న‌రేట్ చేయాల‌ని యూపీఐ ఆప‌రేట‌ర్స్‌ను ఇప్ప‌టికే ఎన్‌పీసీఐ ఆదేశించింది. 

ఈ మేర‌కు జనవరి 9న ఓ ప్ర‌త్యేక‌ సర్క్యులర్‌ను జారీ చేసింది. లేనిప‌క్షంలో ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి ఆయా లావాదేవీలు ఆగిపోతాయ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా, ఈ ఆదేశాల‌ను పాటించ‌ని యాప్స్ ద్వారా వినియోగ‌దారులు ట్రాన్సాక్ష‌న్ చేయ‌లేరు. న‌కిలీ ఐడీల‌ను నివారించ‌డంతో పాటు లావాదేవీల‌ను సుల‌భంగా ట్రాక్ చేయ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎన్‌పీసీఐ వెల్ల‌డించింది. 

అంత‌కంత‌కూ పెరుగుతున్న యూపీఐ లావాదేవీలు..
ఇక యూపీఐ లావాదేవీలు రోజురోజుకీ అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్‌ సంఖ్య 2024 డిసెంబర్‌లో 16.73 బిలియన్లకు చేరుకుంది. ఇది నవంబర్‌లో 15.48 బిలియన్లతో పోలిస్తే 8 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. 

కాగా, డిసెంబరులో ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరుకోగా, అంతకు ముందు నెలలో రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రోజువారీ సగటు లావాదేవీల సంఖ్య కూడా నవంబర్‌లో 516.07 మిలియన్ల నుంచి డిసెంబర్‌లో 539.68 మిలియన్లకు పెరిగింది.
Go Back to Shorts
UPI Transactions
NPCI
February 1

More Telugu News