హైదరాబాదులో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహణ.. ముఠా సభ్యుల అరెస్టు
- గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్‌మెంట్‌లో ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
- విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యుల అరెస్టు
- తొమ్మిది మంది ఆఫ్రికా యువతులను కాపాడిన పోలీసులు
ఈ దాడుల్లో విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్న ముఠా సభ్యుల్లో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది ఆఫ్రికా యువతులను కాపాడారు. ఈ ముఠా సభ్యులు ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.