ఉక్రెయిన్, రష్యా వార్ .. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
- పుతిన్‌తో త్వరలో మాట్లాడతానన్న డొనాల్డ్ ట్రంప్
- ఇప్పటికే చాలా సార్లు జెలెన్ స్కీతో మాట్లాడినట్లు వెల్లడి
- యుద్ధాన్ని ఆపాలని ఇరువురు భావిస్తున్నారన్న ట్రంప్
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్ తనతో మాట్లాడాలని అనుకుంటున్నారని, త్వరలోనే చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఇదివరకే తాను జెలెన్‌స్కీతో చాలాసార్లు మాట్లాడినట్లు తెలిపారు. వారు యుద్ధాన్ని ఆపాలని అనుకుంటున్నారని చెప్పారు. పుతిన్ కూడా ఇదే కోరుకుంటున్నారని భావిస్తున్నానని అన్నారు. ఈ విషయంలో తాము సహాయం చేస్తామని తెలిపారు. ఇదే క్రమంలో తన మొదటి విదేశీ పర్యటన గురించి ట్రంప్ వెల్లడించారు. బ్రిటన్ లేదా సౌదీ అరేబియాకు తన తొలి విదేశీ పర్యటన ఉండవచ్చని ట్రంప్ తెలిపారు.