స్కూలు ఆవరణలో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు.. వీడియో ఇదిగో!
- జగిత్యాల సీఎస్ఐ స్కూలులో ఘటన.. విద్యార్థినులతో శుభ్రం చేయిస్తున్న ఉపాధ్యాయులు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- పిల్లలతో శుభ్రం చేయించడంపై మండిపడుతున్న నెటిజన్లు
పవిత్రమైన పాఠశాల ఆవరణను ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా చేసుకున్నారంటూ వాపోయారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ స్కూల్ ఇంటర్నేషన్ (CSI) ఎయిడెడ్ బాలికల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, బాలికలతో పాఠశాల ఆవరణను శుభ్రం చేయించడం ఏంటని ఉపాధ్యాయులపై స్థానికులు, నెటిజన్లు మండిపడుతున్నారు.