పరస్పర అంగీకారంతో శృంగారం.. మహిళపై దాడికి లైసెన్స్ కాదు: కర్ణాటక హైకోర్టు
- సామాజిక కార్యకర్త-సీఐ మధ్య నాలుగేళ్లుగా శారీరక బంధం
- ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సీఐపై మహిళ ఫిర్యాదు
- కేసును కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ
- అత్యాచార ఆరోపణలను నేరంగా పరిగణించలేమన్న కోర్టు
- భౌతిక దాడి, మోసం, హత్యాయత్నం, దాడి, నేరపూరిత ఆరోపణలకు బలం ఉందన్న న్యాయస్థానం
- కేసు కొట్టివేసేందుకు నిరాకరణ
అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అశోక్ కుమార్ తనను నిర్బంధించి అత్యాచారం చేశాడని, భౌతిక దాడికి పాల్పడ్డాడని, హత్యాయత్నం చేశాడని ఆరోపించారు. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ కుమార్ కోర్టును ఆశ్రయించారు. తమ మధ్య బంధం పరస్పర అంగీకారంతో కొనసాగుతోందని కోర్టుకు విన్నవించారు.
కేసును విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో శృంగార సంబంధం కొనసాగిస్తున్నప్పటికీ, మహిళపై దాడికి అది లైసెన్స్ కాబోదని జస్టిస్ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు. ఫిర్యాదుదారుపై నిందితుడు స్త్రీ ద్వేషంతో కూడిన క్రూరత్వం ప్రదర్శించినట్టు కనిపిస్తోందని అన్నారు. అయితే, ఏకాభిప్రాయంతో నాలుగేళ్లుగా కొనసాగుతున్న శారీరక బంధాన్ని నేరంగా పరిగణించలేమని, అత్యాచారం ఆరోపణలను అంగీకరించలేమని తేల్చి చెప్పింది. అయితే, మోసం, హత్యాయత్నం, దాడి, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలకు బలం ఉందని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఈ విషయంలో విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.