ట్రంప్ తో చర్చలకు పుతిన్ రెడీ
- రష్యా కీలక ప్రకటన
- అమెరికాతో చర్చలకు సిద్ధమన్న రష్యా
- ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించని రష్యా
- ఉక్రెయిన్ యుద్దంతో క్షీణించిన ఆమెరికా – రష్యా సంబంధాలు
ఈ తరుణంలో రష్యా నుంచి కీలక ప్రకటన వెలువడింది. డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారంటూ రష్యా ప్రకటించింది. ఈ విషయంపై అమెరికా నుంచి స్పందన కోసం తాము వేచి ఉన్నట్లు తెలిపింది. అయితే ఇరు దేశాల అధినేతల మధ్య సమావేశం త్వరలో ఉంటుందా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
అయితే ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానని, చమురు ధరలు దిగి వస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో రష్యా ఏకీభవించలేదు. చమురు ధరలకు, తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని రష్యా పేర్కొంది.
మరోపక్క ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా – రష్యా మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. రష్యాతో యుద్ధం చేస్తున్న జెలెన్‌స్కీ సైన్యానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ హయాంలో భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్ధికంగా చేయూతనిచ్చిన విషయం తెలిసిందే.