ట్రంప్ ఆదేశాలతో 500 మందికి పైగా అరెస్ట్
- అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం
- వందల మందిని డిపోర్ట్ చేసిన అమెరికా పోలీసులు
- వీరంతా నేరాలు, మాదకద్రవ్యాల రవాణా కేసుల్లో నిందితులే!
ట్రంప్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. వీరంతా లైంగిక నేరాలు, మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం తదితర కేసుల్లో నిందితులుగా ఉన్నవారే.
ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ... గత నాలుగేళ్లలో (బైడెన్ ప్రభుత్వంలో) అక్రమ వలసదారులు పోటెత్తారని చెప్పారు. లక్షలాది మంది సరైన పత్రాలు లేకుండానే దేశంలోకి చొరబడ్డారని తెలిపారు. వీరంతా దేశ భద్రతకు, ప్రజల రక్షణకు ముప్పుగా మారుతున్నారని చెప్పారు. వలసదారుల కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.