తలసాని ఇంట్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్
- జూబ్లీహిల్స్ లోని తలసాని నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం
- జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం అంశంపై చర్చిస్తున్న నేతలు
- అవసరమైనంత మంది సభ్యులను సమకూర్చుకోవడంపై సమాలోచనలు
ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి, మాజీ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా సమావేశానికి హజరైనట్టు సమాచారం.