అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్.. మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం
- ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్
- వాషింగ్టన్‌లో మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత
- కేపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ప్రమాణ స్వీకారం
- తొలి రోజే వందకుపైగా ఆదేశాలపై ట్రంప్ సంతకాలు
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాషింగ్టన్ చేరుకున్నారు. సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ తన రోజును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు చేరుకుని అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి కేపిటల్ హిల్‌కు చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం తొలి రోజే ట్రంప్ 100కు పైగా ఆదేశాలపై సంతకాలు చేస్తారు.