కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బ్యాగ్ పంచాయితీ.. సోషల్ మీడియాలో రచ్చ
- ఏసీబీ ఆఫీసులో పదేళ్లుగా పడి ఉన్న నల్ల బ్యాగు.. ఇది ఎవరిదో తెలుసా అంటూ బీఆర్ఎస్ ట్వీట్
- ఆ బ్యాగును చూసి కేటీఆర్ భయపడ్డారా అంటూ కాంగ్రెస్ రీట్వీట్
- బీఆర్ఎస్ దోపిడీ దొంగల అవినీతి చిట్టా అందులోనే ఉందని కౌంటర్
‘‘ఫార్ములా ఈ కార్ రేస్ స్కాం, ఔటర్ రింగు రోడ్డు దోపిడీ, కాళేశ్వరం స్కాం, అక్రమ ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలు, కవిత లిక్కర్ స్కాం, ధరణి పోర్టల్ తో చేసిన భూ దోపిడీ, స్కీంల పేరుతో చేసిన స్కాంలు, గొర్రెల స్కాం, సర్పంచ్ లకు ఎగ్గొట్టిన బిల్లులు, మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుల వివరాలు, దళితులపై మీ దౌర్జన్యాలు.. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మీ బీఆర్ఎస్ దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ ఒక్క బ్యాగు సరిపోదు, ఇంకా చాలా బ్యాగులను నింపాల్సి ఉంది. కేటీఆర్ విచారణకు వెళ్ళిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి’’ అంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చింది.