ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారం
- అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై అభియోగాలు
- రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
- పులివెందులలోని అతడి నివాసంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైసీసీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డితో అసభ్య పోస్టులు పెట్టించాడని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అటు... ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులోనూ రాఘవరెడ్డి ఏ20 నిందితుడిగా ఉన్నాడు.
ఇవాళ పులివెందులలోని రాఘవరెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పులివెందుల పీఎస్ కు తరలించారు.