మస్క్ కు ఆ ఛాన్స్ లేదంటున్న ట్రంప్
- భవిష్యత్తులో మస్క్ అమెరికా అధ్యక్షుడు కావొచ్చా అంటే కుదరదని వెల్లడి
- రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టిన వారికే ఆ ఛాన్స్ ఉంటుందని వివరణ
- ఎలాన్ మస్క్ అమెరికాలో పుట్టకపోవడంతో అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం లేదన్న ట్రంప్
దీనిపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఎలాన్ మస్క్ కు లేదని స్పష్టం చేశారు. అమెరికాలో జన్మించిన వారికే అధ్యక్ష బరిలో నిలబడే వీలు ఉంటుందని, మస్క్ కు అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ ఆయన మన దేశంలో పుట్టలేదని ట్రంప్ గుర్తుచేశారు. అందువల్ల అధ్యక్షుడిగా పోటీ చేయడానికి మస్క్ అనర్హుడని, భవిష్యత్తులోనూ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాలేడని స్పష్టం చేశారు. ఈమేరకు అరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలను ప్రస్తావించారు. ప్రెసిడెంట్ మస్క్ అంటూ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ మస్క్ అధ్యక్షుడు కాలేరని కచ్చితంగా చెప్పగలనని వివరించారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం..
అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారం జన్మత: అమెరికా పౌరుడు అయి ఉండాలి. అమెరికా గడ్డ మీద పుట్టిన వారికే ఆ దేశాన్ని పాలించే అవకాశం ఉంటుంది. అమెరికాలో జన్మించకపోయినా ఆ దేశ పౌరసత్వం పొందొచ్చు.. టెక్నికల్ గా అమెరికా పౌరుడే అయినా అమెరికాలో పుట్టని వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడు కాలేడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలాన్ మస్క్ అమెరికా పౌరసత్వం పొందారు.