‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘ధోప్’ సాంగ్ విడుదల
Add ap7am to your home Screen

‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘ధోప్’ సాంగ్ విడుదల

After Blockbuster Tracks another Dhop songs Released from Global Star Ram Charans Game Changer movie
  • లిరిక్స్ అందించిన రామ జోగయ్య శాస్త్రి
  • ఆలపించిన ఎస్ఎస్ థమన్, రోషిణి జేకేవీ, పృథ్వీ శృతి రంజని
  • జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘గేమ్ ఛేంజర్’
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కానుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఆల్బమ్ నుంచి నాలుగవ సాంగ్ వచ్చేసింది. ‘ధోప్’ పాటను చిత్ర యూనిట్ ఇవాళ (ఆదివారం) రిలీజ్ చేసింది. నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ‘ధోప్’ సాంగ్ టీజర్‌ను విడుదల చేయగా, అమెరికాలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రదర్శించారు. ఫైనల్‌గా అభిమానుల కోసం యూట్యూబ్‌‌లో ఆదివారం విడుదల చేశారు.

రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను ఎస్ఎస్ థమన్, రోషిణి జేకేవీ, పృథ్వీ శృతి రంజని పాడారు. ఫ్రెష్ మ్యూజిక్‌తో సంగీత ప్రియులను అలరించేలా ఈ సాంగ్ ఉంది. కాగా, గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ పాటలు విడుదలయాయి. ‘జరగండి జరగండి’, ‘దాం తు దిఖాజా’, ‘జానా హైరాన్ సా’ సాంగ్స్ జనాదరణ పొందాయి.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అలరించబోతున్నాడు. ఈ మెగా ప్రాజెక్ట్‌లో కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
.
Advertisement
Game Changer
Ram Charan
Movie News
Tollywood

More Telugu News