PV Sindhu: ఉదయ్‌పూర్‌లో ప్రారంభమైన పీవీ సింధు పెళ్లి సందడి

PV Sindhu wedding buzz has Started In Udaypur
షార్ట్స్‌లో చూడండి
భారత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుక సందడి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మొదలైంది. హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఈ రోజు (ఆదివారం) రఫల్స్ స్టార్ హోటల్లో జరగబోతుంది. సింధు, ఆమె కాబోయే భర్త వెంకట దత్త సాయి సహా వారి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం (గురువారం) ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. 

సింధు, దత్త సాయి వివాహ మహోత్సవానికి 140 మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో అతిథులకు హోటల్లో వంద గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. వివాహ వేడుకలో భాగంగా శనివారం మెహిందీ, సంగీత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు నూతన వధూవరులు ఫోటో షూట్ కూడా చేసుకున్నారు. 

ఈ వివాహ వేడుకకు క్రీడా, రాజకీయ, సినీ రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఇందుకోసం రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. దక్షిణ భారత్ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ వివాహానికి వచ్చే అతిథులకు రాజస్థాన్ రాచరిక మర్యాదలతో పాటు ప్రత్యేక వంటకాల రుచి చూపనున్నారు. మంగళవారం (24న) హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. 

కాగా, పీవీ సింధు తన వివాహ మహోత్సవానికి ప్రధాని మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సహా పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులను ఆహ్వానిస్తూ శుభలేఖలను అందించిన విషయం తెలిసిందే.  
Go Back to Shorts
PV Sindhu
Udaypur
Rajasthan

More Telugu News