అల్లు అర్జున్ అరెస్ట్ పై పూనమ్ సెటైర్
- రాజకీయానికి, నాయకత్వానికి తేడా చెప్పిన నటి
- అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయమని వ్యాఖ్య
- బన్నీకి మద్దతుగా ట్వీట్ చేసిన పూనమ్
అల్లు అర్జున్ అరెస్టులో రాజకీయం ఉందని, అధికార దుర్వినియోగం జరిగిందనే అర్థంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతకు ముందు శుక్రవారం అల్లు అర్జున్ తో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ తన ఫేవరెట్ హీరో అంటూ పూనమ్ పోస్ట్ పెట్టింది. అయితే, ఈ వ్యాఖ్యలు అసందర్భమని, అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ వ్యాఖ్యానించాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో శనివారం పూనమ్ మరో ట్వీట్ చేస్తూ.. ‘అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం, అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించడమే నాయకత్వం’ అంటూ రెండింటి మధ్య తేడా చెప్పారు. జస్ట్ థాట్స్ అంటూ పూనమ్ ఈ ట్వీట్ కు క్యాప్షన్ జోడించారు.