సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ వీడియో!
ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బన్నీపై ఇప్పటికే నమోదు చేశారు. ఆయనపై పోలీసులు బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీ గార్డ్ సహా థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.