హిందుత్వ అనేది ఓ జబ్బు.. షాకింగ్ వీడియోను షేర్ చేస్తూ మాజీ సీఎం కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు
- ‘జై శ్రీరామ్’ అనాలంటూ ముగ్గురు ముస్లిం బాలురపై చెప్పుతో దాడి
- వారు ఏడుస్తూ భయంతో ‘జై శ్రీరామ్’ అంటున్నా చెంపలు వాయించిన కుర్రాడు
- ఈ వీడియోను షేర్ చేసిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా
- ఈ వీడియోను చూసి రాముడు సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్య
ఈ వీడియోను షేర్ చేసిన ఇల్తీజా.. తన పేరు జపించేందుకు నిరాకరించిన ముస్లిం బాలురను చెప్పుతో కొడుతుండడాన్ని చూసి రాముడు సిగ్గుతో తలవంచుకుని నిస్సహాయంగా చూడాలని రాసుకొచ్చారు. హిందుత్వ అనేది ఒక జబ్బులాంటిదని, దేవుడి పేరుతో కోట్లమంది భారతీయులపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, గతంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దానిని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.