Harish Rao: రేవంత్ రెడ్డీ! నీకు చేతనైంది అదే కదా: హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao fires at Revanth Reddy for PS cases
షార్ట్స్‌లో చూడండి
రేవంత్ రెడ్డీ... నీకు చేతనైంది తప్పు చేసి దబాయించడం... తప్పుడు కేసులు బనాయించడమే కదా అంటూ బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

"అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు" అని ధ్వజమెత్తారు. 

రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేశావని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో తన మీద సంబంధం లేని కేసు పెట్టారన్నారు.

పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే... మానకొండూరులో అక్రమ కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఈరోజు పంజాగుట్ట స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించారని ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు.

"నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా... నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను... ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంతవరకు ఆగను" అని రాసుకొచ్చారు.
Go Back to Shorts
Harish Rao
BRS
Revanth Reddy
Telangana

More Telugu News