బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్రంప్

Donald Trump Slams Joe Biden For Pardoning Son
  • కొడుకుకు క్షమాభిక్ష పెట్టిన ప్రెసిడెంట్ బైడెన్
  • ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని ట్రంప్ విమర్శ
  • క్యాపిటల్ భవనం అల్లర్ల బందీలను క్షమించలేదేమని ప్రశ్న
ప్రెసిడెంట్ జో బైడెన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టారని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బైడెన్ నిర్ణయం పూర్తిగా న్యాయ విరుద్ధమని ఆరోపించారు. క్రిమినల్ కేసుల నుంచి కొడుకును తప్పించేందుకు అమెరికా రాజ్యాంగం కల్పించిన అధికారాలను బైడెన్ దుర్వినియోగపరిచారని మండిపడ్డారు. హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే క్యాపిటల్ హిల్ దాడి కేసులో బందీలను విడుదల చేయలేదేమని నిలదీశారు. 

తుపాకీ అక్రమంగా కొన్నారని, ఆదాయపన్ను చెల్లింపు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని హంటర్ బైడెన్ పై పోలీసులు గతంలో కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాత కోర్టు హంటర్ ను దోషిగా తేల్చింది. అయితే, శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. ఈ కేసులకు సంబంధించి తాను కల్పించుకోబోనని ప్రెసిడెంట్ బైడెన్ గతంలో పేర్కొన్నారు. అయితే, తాజాగా హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో హంటర్ కు శిక్ష పడే అవకాశం లేదు. అధ్యక్ష హోదాలో కొడుకుకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు.
Go Back to Shorts
Joe Biden
Hunter Biden
Donald Trump

More Telugu News