ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
Add ap7am to your home Screen

ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్

Trumps Big Warning For India China Russia
  • డాలర్‌ను దూరం పెట్టారంటే పన్నులు 100% పెంచుతామని అల్టిమేటం
  • అమెరికాకు ఎగుమతులు చేయలేరని హెచ్చరిక
  • అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని వెల్లడి
అంతర్జాతీయ వర్తకంలో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డాలర్‌ను దూరంపెట్టే ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వర్తకానికి కూడా దూరం కావాల్సిందేనని హెచ్చరించారు. ఈ మేరకు బ్రిక్స్ దేశాలు ఇండియా, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ స్థానంలో మరో కరెన్సీ వాడాలని ఇటీవల బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. డాలర్ స్థానంలో వేరే కరెన్సీని ఉపయోగించే దేశాలపై పన్నులు పెంచుతామని చెప్పారు. అమెరికాకు ఆయా దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పన్నులు 100 శాతం పెంచుతామని స్పష్టం చేశారు.

బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటామని, డాలర్‌కు దూరంగా జరిగే దేశాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటుండదని హెచ్చరించారు. అమెరికాకు ఎగుమతుల విషయం మర్చిపోవాల్సి వస్తుందని వివరించారు. కాగా, అక్టోబర్‌లో రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో అంతర్జాతీయ లావాదేవీలలో డాలర్‌కు బదులుగా స్థానిక కరెన్సీ వాడాలని నిర్ణయించాయి. దీనివల్ల స్థానిక కరెన్సీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డాయి. ఈ సమావేశంలో ఈజిప్ట్, ఇరాన్, యూఏఈ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ఓ డిక్లరేషన్‌పై బ్రిక్స్ దేశాలు సంతకం చేశాయి. దీనిపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
Advertisement
Donald Trump
India
Warning
Dollor
BRICKS

More Telugu News