హైదరాబాదులో డిసెంబరు 8 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ

agniveer recruitment rally in hyderabad
  • ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు గుడ్ న్యూస్
  • అగ్నివీర్ నియామకాలకు రిక్రూట్మెంట్ డ్రైవ్
  • గచ్చిబౌలిలో డిసెంబర్ 8 నుండి 16 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ
భారత సైన్యంలో సేవలు అందించాలని భావించే యువతీయువకులకు ఇది గుడ్ న్యూస్. ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు.. అభ్యర్ధుల ఎంపికకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. 

గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం నందు నియామక ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ ట్రెడ్స్‌కు పదవ తరగతి అర్హతగా ఉండాలని పేర్కొన్నారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీస్ అభ్యర్ధులకు ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ జరిగే ప్రదేశానికి అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని బోర్డు సూచించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని అధికారులు వివరించారు. 
Go Back to Shorts
agniveer recruitment rally
Hyderabad
Indian Army
Job news

More Telugu News