భర్తతో కలిసి నయనతార డిన్నర్ చేస్తున్నా పట్టించుకోని జనం... వీడియో ఇదిగో!

People ignores Nayanthara and her husband in a  Delhi restaurant
  • ఇటీవల ఢిల్లీలో ఓ రెస్టారెంట్ కు వెళ్లిన నయన్, విఘ్నేశ్
  • క్యూలో అరగంట సేపు నిల్చున్న సెలెబ్రిటీ కపుల్
  • ఈ సౌత్ జోడీని గుర్తించని ఢిల్లీ జనాలు
సినీ తారలకు జనాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారు ఇంట్లోంచి అడుగు బయటపెడితే చాలు... వారిని చూసేందుకు ప్రజలు భారీగా గుమికూడతారు. పబ్లిక్ లోకి వచ్చారంటే వారి ప్రైవసీ కోల్పోయినట్టే. అందుకే సినీ స్టార్లు బౌన్సర్లను పెట్టుకుని మేనేజ్ చేస్తుంటారు. 

అయితే, నయనతారకు, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇటీవల నయనతార, విఘ్నేశ్ శివన్ ఢిల్లీలో ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అయితే, వారిని అక్కడ ఎవరూ గుర్తించలేదు. 

భర్తతో కలిసి నయనతార వంటి సౌతిండియా టాప్ హీరోయిన్ డిన్నర్ చేస్తున్నా... రెస్టారెంట్లో ఆ కోలాహలమే కనిపించలేదు. ఎవరి పాటికి వాళ్లు లాగించేస్తూ దర్శనమిచ్చారు. ఈ సెలెబ్రిటీ కపుల్ హోటల్ వద్ద అరగంట సేపు క్యూలో ఉన్నా గానీ... ఒక్కరు కూడా వీళ్ల వైపు చూసిందే లేదట. 

దీనికి సంబంధించిన వీడియోను నయనతార భర్త విఘ్నేశ్ శివన్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో సందడి చేస్తోంది.
Go Back to Shorts
Nayanthara
Vighnesh Shivan
Restaurant
New Delhi
Kollywood

More Telugu News