Ram Charan: రామ్ చరణ్ పై శంషాబాద్ లో అయ్యప్ప స్వాముల ఫిర్యాదు

Ayyappa devotees complains against Hero Ram Charan in Shamshabad
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండి కడప దర్గాను దర్శించడం వివాదాస్పదమైంది. మాలధారణ దుస్తుల్లో ఉన్న రామ్ చరణ్ కడప అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. దాంతో ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ పై శంషాబాద్ లో అయ్యప్పస్వాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ అయ్యప్పస్వామి సొసైటీ సభ్యులు నేడు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పత్రాన్ని అందించారు. రామ్ చరణ్ తన చర్యల ద్వారా అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Ram Charan
Ayyappa Devotees
Shamshabad
Kadapa Dargah

More Telugu News