కొండా సురేఖ వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయింది: న్యాయవాది
- పరువు నష్టం కేసులో వాదనలు వినిపించిన నాగార్జున తరఫు న్యాయవాది
- మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు సరికాదని వెల్లడి
- కొండా సురేఖ కచ్చితంగా క్రిమినల్ చర్యలకు అర్హురాలేనని స్పష్టీకరణ
నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో మంత్రి పెట్టిన పోస్టును న్యాయవాది చదివి కోర్టుకు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొండా సురేఖ కచ్చితంగా క్రిమినల్ చర్యలకు అర్హురాలు అన్నారు.
ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు ఇప్పటికే నమోదు చేసింది. ఆ తర్వాత కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేశారు.
నాగార్జునపై వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ... ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ ట్వీట్ కూడా చేశారు. తన వ్యాఖ్యల వల్ల మీరు గానీ, మీ అభిమానులు గానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అన్యదా భావించవద్దని కొండా సురేఖ ఎక్స్ వేదికగా ఆ రోజే క్షమాపణలు చెప్పారు. ఈ ట్వీట్‌ను న్యాయవాది ఈరోజు కోర్టులో చదివి వినిపించారు.