Anil Kumar Yadav: పార్టీ మారుతున్నారనే వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందన

Anil Kumar Yadav response on party change
షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, రేటింగ్ లు పెంచుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. మరో పార్టీలోకి వెళ్లనని చెప్పారు. త్వరలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. 

తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని అనిల్ మండిపడ్డారు. దీని కోసం నారా లోకేశ్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఎందరో గొప్పవాళ్లు జైలుకు వెళ్లారని... తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
Anil Kumar Yadav
Jagan
YSRCP

More Telugu News