కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
- తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీత
- హంతకులకు శిక్ష పడేందుకు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి
విద్యాసాగర్ కు ముందు కడప ఎస్పీగా వ్యవహరించిన హర్షవర్ధన్ రాజును కూడా సునీత గత ఆగస్టులో కలిశారు. మొదట హోంమంత్రి అనితను కలిసిన అనంతరం, సునీత అప్పటి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి తండ్రి హత్య అంశంపై మాట్లాడారు.
కాగా, హోంమంత్రి అనితను కలిసిన సమయంలో... వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని సునీత ఆవేదన వెలిబుచ్చారు. సీబీఐ విచారణకు పోలీసుల సహకరించేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.