Asif Ali: 5 కోట్లతో 50 కోట్లు రాబట్టిన మలయాళ బ్లాక్ బస్టర్ .. తెలుగులోనూ స్ట్రీమింగ్!

Kishkinda Kaandam Movie OTT Release Date Confirmed
షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో ఖర్చు తక్కువ .. కథాబలం ఎక్కువ అనిపించే సినిమాలు వస్తుంటాయి. అలా చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమాగా ' కిష్కింద కాండం' కనిపిస్తుంది. అసిఫ్ అలీ - అపర్ణ బాలమురళి - విజయ్ రాఘవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 12వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది.

కేవలం 5 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మొత్తాలను కొల్లగొట్టిన అతికొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచింది. దినిజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ నెల 19 నుంచి ఐదు భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు హాట్ స్టార్ ప్రకటించింది.

కథలోకి వెళితే .. కోతులు ఎక్కువగా ఉండే గ్రామం అది. కొంతకాలంగా ఆ గ్రామంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ గ్రామానికి చెందిన అజయన్ (అసిఫ్ అలీ)కి పెళ్లి అవుతుంది .. ఒక కొడుకు కూడా ఉంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా అతనికి అపర్ణ (అపర్ణ బాలమురళి)తో మరో వివాహమవుతుంది. వారి పెళ్లి జరిగిన కొన్ని రోజులకు ఆ పిల్లాడు అదృశ్యమవుతాడు. ఆ పిల్లాడు ఏమైపోయాడు? అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి వలన అజయన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు అనేది కథ. 

Go Back to Shorts
Asif Ali
Aparna Balamurali
Vijay Raghavan
Kishkinda Kaandam

More Telugu News