అమెరికా అధ్యక్షురాలు అయ్యేందుకు కమలా హ్యారిస్ కు ఇప్పటికీ అవకాశం.. ఎలాగంటే..!
- హ్యారిస్ ను ప్రెసిడెంట్ చేయాలంటూ అమెరికాలో కొత్త డిమాండ్
- బైడెన్ రాజీనామా చేస్తే హ్యారిస్ బాధ్యతలు చేపట్టవచ్చన్న డెమోక్రాట్ నేత
- జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం
ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ రాజీనామా చేస్తే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దేశ తొలి మహిళా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతారని తెలిపారు. ఈ ప్రక్రియ రాబోయే కాలంలో అధ్యక్ష ఎన్నికల పోటీలో మహిళలు నిలవడానికి దోహదం చేస్తుందని చెప్పారు. పాలనా బాధ్యతలను ఇప్పటి వరకు అద్భుతంగా నిర్వహించిన బైడెన్.. తన చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున పోటీ చేసిన కమలా హ్యారిస్ మొత్తం 226 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. స్వింగ్ స్టేట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లతో ఎన్నికల్లో విజయం సాధించారు.